జీవితంలో పరిపూర్ణతకు మార్గం ధ్యానం: జీవీ
న్యూస్‌తెలుగు/వినుకొండ: ప్రతిఒక్కరి జీవితంలో పరిపూర్ణత సాధించడానికి మేలైన మార్గం ధ్యానమే అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వ్యక్తిగతంగా తానూ ధ్యానం మొదలు పెట్టిన తర్వాతే జీవితంలో నిజమైన అభివృద్ధిని, మార్పును చూశానని తెలిపారు. బ్రహ్మకుమా రీ సమాజం ద్వారా నేర్చుకున్న రాజయోగ జీవితంలో తనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మనసు బాలేనప్పుడు రాయయోగ, ధ్యానం చేయడం ద్వారా వెంటనే సాధారణ పరిస్థితికి వస్తామని, సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు. వినుకొండ ఇసుకవాగు బజార్ లో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి మహోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. కష్టాలను ఎలా అధిగమించా లనేది ధ్యానం, బ్రహ్మ కుమారీల ద్వారానే నేర్చున్నట్లు తెలిపారు. చిన్న చిన్న ఆనందాలను సంతోషంగా తీసుకుంటునే జీవితంలో సానుకూలంగా ముందుకెళ్తామన్నారు. శివబోధలు గురించిఅందరికీ తెలియజేయా ల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కొండపై రామలింగేశ్వరస్వామి గుడి నిర్మాణం పూర్తి చేసి అక్కడ బ్రహ్మకుమారీలతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని కోరారు. (Story: జీవితంలో పరిపూర్ణతకు మార్గం ధ్యానం: జీవీ)