ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని గెలిపించండి
న్యూస్ తెలుగు/వినుకొండ: ఈనెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం వినుకొండ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లలో కూటమి నేతలు గ్రాడ్యుయేట్స్ ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ. రాజేంద్ర ప్రసాద్ కష్టపడి పని చేసే వ్యక్తి అని ఎన్జీవో సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. ఒకసారి ఆలోచించాలని గత వైసిపి ప్రభుత్వంలో టీచర్స్ విలువ లేకుండా ఇబ్బంది పెట్టిందని ముఖ్యంగా టీచర్స్ ను బాత్రూములు ఫోటోలు తీసి పెట్టాలని, ఆనాడు ఉన్న ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ చెప్పడం ఇంకా మీమనసులో ఉన్నదని, చివరకు బ్రాందీ షాపులు దగ్గర కూడా నిలబెట్టిన సందర్భాన్ని మరిచిపోవద్దని, ముఖ్యంగా ఉద్యోగులు పిఆర్సి కోసం ఆందోళన చేస్తా ఉంటే ఎక్కడికి అక్కడ అరెస్టు చేసి విజయవాడకు వెళ్లకుండా ఉద్యమంపై ఉక్కు పాదం పెట్టిందని గుర్తు చేశారు. దాని ఫలితం రివర్స్ పియర్స్ అయిందని దానివల్ల ఒక్కొక్క ఉద్యోగి లక్ష పైచిలుకు నష్ట పోవాల్సి వస్తుందని అన్నారు. అటువంటి పార్టీ సపోర్ట్ చేసే వ్యక్తులను గెలిపించవద్దని అన్నారు. కనుక మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాథమిక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎండ్లూరి వీరయ్య, జెడ్డా లక్ష్మీనారాయణ, పట్టణ నారిసెట్టి మహేష్, కాలువ నరేష్, తదితరులు పాల్గొన్నారు. (Story: ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని గెలిపించండి)