హోటళ్లకు స్వచ్చతా గ్రీన్ లీఫ్ రేటింగ్
పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడపాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం: విజయనగరం పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. అందుకోసం ఘన వ్యర్ధాల నిర్వహణ, మానవ వ్యర్ధాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ ల ఆధారంగా మూడు విధాలుగా మార్కు లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరం లో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో , డివిజన్ స్థాయిలో సబ్ కమిటీలు హోటల్స్ ను తనిఖీ చేసి రేటింగ్ కోసం సిఫార్సు చేయడం జరుగుఉందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్ ను హోటళ్ళు ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటళ్ళ ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న హోటల్స్ ను ప్రభుత్వమే వెబ్సైటు నందు పెట్టి ప్రోత్సహిస్తుందని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా హోటళ్ళు ఉంటె వారి వాణిజ్య ప్రయోజనాలు మెరుగుపడతాయని అన్నారు. హోటళ్ళు నిర్వహణ ఎకో ఫ్రెండ్లీ గా ఉండాలని, వారి సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం తో పాటు, హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ నెలాఖరు లోపు మరో సారి హోటల్ యజమానులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తర్వాత కమిటీ ల సందర్శన అనంతరం ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశం లో జిల్లా పర్యాటక అధికారి కుమార స్వామి, ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఈ కవిత, డి.పి.ఓ వెంకటేశ్వర రావు, పలు హోటళ్ళ యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస రావు, బాబు రావు కలెక్టర్ ను పుష్ప గుచ్చం తో సత్కరించారు. (Story: హోటళ్లకు స్వచ్చతా గ్రీన్ లీఫ్ రేటింగ్)