విలేకరిపై దాడికి నిరసనగా ధర్నాలు
న్యూస్ తెలుగు/సాలూరు: మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై మక్కువ మండల టిడిపి అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు దాడికి నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, నిరసనలు తెలిపారు. జర్నలిస్టులపై దాడులను అన్ని కలెక్టర్ ఆఫీసులు వివిధ ఆఫీసుల ముందు వినతి పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీసులో జర్నలిస్ట్ సంఘాలు కలెక్టర్ కు ఎస్పి కి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వార్తలు వ్రాస్తున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని కోరారు. రామారావుపై దాడి చేసిన మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయని, ఈ దాడులు అరికట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు ఉద్ధృతం చేస్తామని అన్నారు. (Story: విలేకరిపై దాడికి నిరసనగా ధర్నాలు)