మంత్రి సంధ్యారాణికి కొదమ ప్రజల వినతి
న్యూస్ తెలుగు/సాలూరు: కొదమ పంచాయితీ కౌంజుపాక గిరిజన గ్రామ పెద్దలు, యువత రహదారి సౌకర్యం లేక విద్యార్దులు, వృద్దులు, గర్భిణీలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నామని, రహదారి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కంజుపాక గిరిజనులు మాట్లాడుతూ దుగ్గేరు సెంటర్ నుండి కంజుపాక గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.అద్దె ఇంట్లో నడుస్తున్న అంగన్వాడీ, పాఠశాల భవనాలు మంజూరు చేయమని కోరారు. గిరిజన పెద్దలు, యువత అడిగిన రహదారి, అంగన్వాడీ, పాఠశాల భవనం ప్రాధాన్యత ప్రకారం మంజూరు చేస్తామని మంత్రి సంధ్యారాణి వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. (Story: మంత్రి సంధ్యారాణికి కొదమ ప్రజల వినతి)