సంత్ సేవాలాల్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధి
టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తిని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందని వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ నాయకులు హనుమా నాయక్, విష్ణు నాయక్ అన్నారు. రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబు, వినుకొండలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తండాలు అంతటా సిమెంట్ రోడ్లు, సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నరన్నారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల ను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సేవావాల్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారిద్దరూ మాట్లాడుతూ. గిరిజనులకు చేసిన మేలు కారణంగానే తామందరికీ సంత్ సేవాలాల్ దేవుడిగా నిలిచారన్నారు. 18వ శతాబ్దంలో అనంతపురం జిల్లా గుంతకల్ నియోజక వర్గంలో భీమా నాయక్ కుమారిడిగా జన్మించి సంత్ సేవాలాల్ గిరిజనుల కోసం బ్రిటీష్ వారినే ఎదిరించి పోరాడారంటూ ఘనంగా నివాళులు అర్పించారు. గిరిజనులతో పాటు అన్నివర్గాల వారు బావుండాలని సంత్‌సేవాలాల్ పోరాడారన్నారు. అలానే పొరుగురాష్ట్రం తెలంగాణ తరహాలోనే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీవీ సురేష్, బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్, పట్టణ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, సీనియర్ మేనేజర్ రమణారావు గారు ,పెమ్మసాని నాగేశ్వరరావు, మస్తాన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. (Story : సంత్ సేవాలాల్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధి)