అగ్నిప్రమాద బాధితులకు శివశక్తి ఫౌండేషన్ ఆర్థిక సాయం
న్యూస్‌తెలుగు/వినుకొండ : బొల్లాపల్లి మండలం ఘాటి తండాలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి వంట సామగ్రి, నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం, దుస్తులు, రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి సంబంధిత సాయం అందజేశారు. బొల్లాపల్లి మండలం ఘాటి తండాకు చెందిన బాబు నాయక్ నివాసం ఉంటున్న గుడిసె బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన జీవీ ఆంజనేయులుకు బాబు నాయక్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్, పెమ్మసాని నాగేశ్వరరావు, హనుమా నాయక్, విష్ణు నాయక్, తదితరులు పాల్గొన్నారు. (Story : అగ్నిప్రమాద బాధితులకు శివశక్తి ఫౌండేషన్ ఆర్థిక సాయం)