ప్రారంభమైన తెలంగాణ జాతిపిత
కె.సి.ఆర్ జన్మదిన వేడుకలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : బి.ఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కె.సిఆర్ జన్మదిన సందర్భంగా ముందస్తు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి కెసిఆర్ కి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ కె.సి.ఆర్ పాలనలో తెలంగాణ పచ్చదనంతో పాడి పంటలతో కళకళలాడింది అని అని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు అని మళ్ళీ కె.సి.ఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం కె.సి.ఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నందిమళ్ళ.అశోక్,మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్,కంచే.రవి,స్టార్.రహీమ్, హేమంత్ ముదిరాజ్,చిట్యాల. రాము, జో హెబ్బ్ హుస్సేన్, ఆరీప్,క్రాంతి కుమార్, నీలంభాను,రఘు యాదవ్ పాల్గొన్నారు. (Story ; ప్రారంభమైన తెలంగాణ జాతిపిత కె.సి.ఆర్ జన్మదిన వేడుకలు)