గిరిజనులను ఆత్మగౌరవం,స్వయంశక్తితో ఎదిగేందుకు కృషి చేసిన సంత్ సేవలాల్ మహరాజ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాళాల్ మహరాజ్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్ హైదరబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహరాజ్ ఎన్నో తరాలకు ముందే రాజుల నిరంకుశత్వాన్ని,దౌర్జన్యాన్ని ఎదురించి గిరిజనులకు ఆరాధ్యదైవంగా వెలుగొందారు అని అన్నారు. గిరిజనులు భక్తిమార్గం వైపు,అహింస,ఆత్మస్థైర్యం,స్వయం శక్తితో జీవనం సాగించటానికి కృషి చేశారని అన్నారు. బంజారా హిల్స్ అనే కాలని సంత్ సేవాలల్ పర్యటనలో భాగంగా ఏర్పడిందని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఒక ఎకరా 13గుంటల భూమిలో కోటి రూపాయలతో బంజారా భవన్ నిర్మించామని అన్నారు. కె.సి.ఆర్ తాండలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా చేసి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందించారని రాబోవు కాలములో బి.ఆర్.ఎస్ పార్టీ గిరిజనులకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,మాజీ ఎం.పి మాలోతూ.కవిత,రావుల చంద్రశేఖరరెడ్డి, ముఠా.గోపాల్ ఎం.ఎల్. ఏ తదితరులు పాల్గొన్నారు. (Story : గిరిజనులను ఆత్మగౌరవం,స్వయంశక్తితో ఎదిగేందుకు కృషి చేసిన సంత్ సేవలాల్ మహరాజ్)