డా.మతుకుమల్లి శారదకు శ్రీ సాయి సేవ భగవాన్ పురస్కారం
న్యూస్ తెలుగు/వినుకొండ: పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద కు శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ పురస్కారం అవార్డును అందజేశారు. చిలకలూరిపేట కు చెందిన జై సాయి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ పూసపాటి బాలాజీ ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక ,భక్తి భావం, సామాజిక సేవతో పాటు సమాజం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచే వారికి జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం అవార్డును అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక సామాజిక రంగాలతో పాటు నవ సమాజం కోసం శ్రమిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న వినుకొండకు చెందిన మనం ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మతుకుమల్లి శారద కి ఆదివారం చిలకలూరిపేటలో జై జై సాయి ట్రస్ట్ కార్యక్రమంలో జరిగిన సేవా పురస్కారం అవార్డును మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ పూసపాటి బాలాజీ మరికొందరు ప్రముఖులు డా. మతుకుమల్లి శారద ని శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ జాతీయ పురస్కారం అవార్డును అందుకున్న శారద ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బాలాజీ , జాగృతి మండలి వ్యవస్థాపకురాలు పిడతల రమాదేవి, నవతరం పార్టీ అధ్యక్షురాలు కంచర్ల సుజాత, పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, సయ్యద్ షకీల, ఎలమంచిలి వరుణ్ తదితరులు పాల్గొన్నారు. (Story: డా.మతుకుమల్లి శారదకు శ్రీ సాయి సేవ భగవాన్ పురస్కారం)