కార్పొరేట్లకు తొత్తుగా మారిన కేంద్ర ప్రభుత్వం
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రథమ మహాసభలో వక్తలు
న్యూస్ తెలుగు/వినుకొండ: పల్నాడు జిల్లా, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రధమ మహాసభ రైల్వే స్టేషన్ రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో ఈ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభ కి తోట ఆంజనేయులు అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఎన్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి బి. బంగా రావు , ఐఫా రాష్ట్ర కార్యదర్శి నాగమణి, రాష్ట్ర నాయకులు రాందేవ్, ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిందని, మతాల మధ్య ఘర్షణలు పెంచి ఉన్మాదాన్ని రెచ్చ కొట్టి ప్రజా సమస్యలు పక్క దారి పట్టిస్తూ, దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపాదన కార్పొరేట్లకు అప్ప చెప్పి ప్రజలపై పనుల భారాన్ని పెంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టంలో పూర్తిగా విఫలమయ్యారని , బిజెపి ఎజెండా అని పవన్, బాబు ఇద్దరు ఆంధ్రాలో అమలు చేస్తున్న దానివల్ల దక్షిణ భారతదేశంలో కూడా మతోన్మాద రాజకీయాలు ఏర్పడుతూ ఉన్నాయని సిపిఐ ఎంఎల్ పార్టీ ప్రజల సమస్యలపై అజెండాగా తీసుకొని మార్చి ఏప్రిల్ లో పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ ఉద్యమంలో పల్నాడు జిల్లా అగ్రభాగంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బి బంగారరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు, వలసరాజకీయాలు పెంచి పోషిస్తున్నారు. ఇటువంటి రాజకీయాలను ప్రజలు త్వరలోనే గమనించి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా కార్యదర్శిగా తోట ఆంజనేయులు
అనంతరం రాష్ట్ర కార్యదర్శి నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. పల్నాడు జిల్లా కార్యదర్శిగా తోట ఆంజనేయులు, కమిటీ సభ్యులుగా షేక్ ఫిరోజ్, ధూపాటి నాని, పల్నాడు శ్రీనివాసరావు, ఓబులాపురం ఆంజనేయులు, కామా వెంకటేశ్వర్లు, సిబ్బంది నాయక్, హరికృష్ణ, చెన్న కృష్ణయ్య లను ప్రకటించారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం ఆమోదించారు. అనంతరం వినుకొండ మండల కార్యదర్శిగా ధూపాటి నాని, వినుకొండ టౌన్ కార్యదర్శిగా ఎస్కే ఫిరోజ్, బొల్లాపల్లి కార్యదర్శిగా డి. సిబ్బంది నాయక్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు తొమ్మిది మంది తోటి మండల కమిటీ టౌన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story: కార్పొరేట్లకు తొత్తుగా మారిన కేంద్ర ప్రభుత్వం)