గ్రామాల సర్వతోముకాభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం సర్వతోముకాభివృద్ధి సాధిస్తుందని, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం లోని పలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఆయన స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల BRS పాలనలో గ్రామాలన్ని నిర్వీర్యమైపోయాయని, గ్రామాల అభివృద్ధి పేరుతో అందినంత దోచుకున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సర్వోతో ముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలో గ్రామాలను అభివృద్ధిపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దమందడి మండలానికి CRR నుంచి మంజూరైన 13 కోట్ల 92 లక్షలకు సంబంధించిన పనులకు CRR SCP ద్వారా రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు, DMFT ద్వారా మంజూరైన 9 లక్షల 50 వేల నిధులకు సంబంధించిన పనులకు
MGNREGS నిధుల నుంచి మంజూరైన 32 లక్షల నిధులకు సంబంధించిన పనులకు, MRR నుంచి 78 లక్షల నిధులకు సంబంధించిన పనులకు, SDF కు సంబంధించిన 10 లక్షల నిధులకు సంబంధించిన పనులకు STSDF నిధుల నుంచి 1 కోటి 50 లక్షలకు సంబంధించి పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలకటోన్ పల్లి, వెల్టూర్, గట్ల ఖానాపూర్, అమ్మపల్లి, మద్ది గట్ల, మోజర్ల, అల్వాల, చిన్నమందడి, వీరాయపల్లి, పామిరెడ్డిపల్లి, బలిజపల్లి, జంగమయ్యపల్లి, దొడగుంటపల్లి, అనకాయపల్లి తండా, పెద్దమందడి, మణిగిల్ల, జగత్ పల్లి గ్రామాలలో
చేపట్టిన ccరోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణాలకు వారు శంకుస్థాపనలు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు వచ్చిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి గారికి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాల్షితో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు యువకులు మహిళలు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : గ్రామాల సర్వతోముకాభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం)