Home వార్తలు తెలంగాణ కనుల పండుగగా అమ్మవారి శిఖర కలశ ఊరేగింపు

కనుల పండుగగా అమ్మవారి శిఖర కలశ ఊరేగింపు

0

కనుల పండుగగా అమ్మవారి శిఖర కలశ ఊరేగింపు

న్యూస్‌తెలుగు/వనపర్తి : కొత్తకోట పట్టణంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి కొలిచే వారికే కొంగు బంగారంగా వెలిసిన శ్రీ భవాని శంకర అమ్మవారి వేడుకల్లో తొలిఘట్టమైన శిఖర కలశాల శోభా యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి కలశ శనివారం పట్టణంలో రాఘవేంద్ర స్వామి వారి ఆలయం నుండి పురవీధుల ఊరేగింపుగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కలశ ఊరేగింపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాన రహదారి ద్వారా అమ్మవారి ఆలయానికి అత్యంత వైభవంగా చేరుకుంది. ఈనెల ఎనిమిదో తేదీ నుండి 10వ తేదీ వరకు నూతన ధ్వజస్తంభ ఏర్పాటు కొరకు మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు ఉత్సాహాలు నిర్వహిస్తున్నారు. ఈ శుభ యాత్రలో దాదాపు 1000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. భక్తులు ప్రజలు మహిళలు జై భవాని జై జై భవాని నామస్మరణతో వీధిలకుండా పరిసరాలు మార్మోగి భక్తులు ప్రజలు కలిసికట్టుగా కాలి నడకన కలశ ఊరేగింపు ఎదట భజన బృందాలు, ఆటపాటలతో కోలాటాలతో బొడ్డెమ్మలతో మహిళలతో అత్యంత కొలహాలంగా కిక్కిరించి సంప్రదాయ వాయిద్యాల నడుమ శోభయాత్ర ఆలయానికి చేరుకున్నది. కలశలు ఆలయానికి చేరుకోగానే అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. వచ్చిన భక్తులకు ప్రజలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులుకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేయడం జరిగింది అని ఆలయ ధర్మకర్త రాఘవేందర్ ప్రసాద్ తెలియజేశారు. (Story : కనుల పండుగగా అమ్మవారి శిఖర కలశ ఊరేగింపు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version