భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రత్యేక పూజలు
న్యూస్ తెలుగు / వినుకొండ : భీష్మ ఏకాదశి సందర్భంగా వినుకొండ శ్రీనివాస నగర్‌లోని అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆయంలో శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు, ప్రముఖుల రాకతో ఆలయం మొత్తం సందడిగా మారింది. ఈ సందర్భంగానే లక్ష తులసి పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం కన్నులపండువగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామికి తులసి దళాలతో జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభి భక్తులకు పంపిణీ చేశారు. తర్వాత మాట్లాడిన చీఫ్ విప్ జీవీ, భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని, అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. లక్ష తులసీదళ పూజ చాలా చక్కగా నిర్వహించారన్నారు. ఆ వెంకటేశ్వరస్వామి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని.. ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఉన్నత స్థాయికి ఎదగాలని దైవాన్ని కోరారు. (Story ; భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రత్యేక పూజలు)
