అగ్ని బాధిత కుటుంబాలకు
ఇంటి నిర్మాణ సామాగ్రి వితరణ
న్యూస్‌తెలుగు/చింతూరు : యటపాక మండలం లోని నల్లకుంట గ్రామానికి చెందిన ఉయిక ఇరమయ్య,తెల్లం రాములమ్మ ఇద్దరు ఇల్లు అగ్నిప్రమాదానికి గురై కలిపోవటం తో కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి వారి కుటుంబాలు.ఇదే తరహాలో గన్నవరం గ్రామానికి చెందిన కారం రవి ఇల్లు కూడా అగ్నిప్రమాదానికి గురై కాలిపోయింది.ఈ విషయాన్ని గ్రామస్తులు జేకే సి టి ఛైర్మెన్ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మహమ్మద్ జమాల్ ఖాన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి మంగళవారం బాధిత కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి ఒక్కో ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్ రేకులు ఇనుప పైపులు అందజేశారు. ప్రకృతి విపత్తులు వరదలు అగ్ని ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్న నేపథ్యంలో తనకు తోచింది బాధిత కుటుంబాలకు అందిస్తున్నానని ఎవ్వరు కూడా తీర్చలేని నష్టం వాటిల్లందని కాలి బుడిదైపోయిన ఇంటి నిర్మాణం సామాగ్రి తో పాటు నిత్యవసర వంట సామాగ్రి బట్టలు మంచాలు వంటివి కాలిపోవడంతో వారి బాధ వర్ణనాతీతమన్నారు. గ్రామంలో పురుషులు అందరూ మంచి అలవాటులతో కుటుంబాలను పోషించుకోవాలని మద్యం జోలికు పోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంతుమంగేశ్వరరావు, ఎన్ సూర్యనారాయణ చౌదరి, మాజీ ఎంపీటీసీ, కణితి మధు,శివ కనకరాజు సర్పంచ్ గౌరీ దేవి పేట, తెల్లం జంపన్న, కొమరం నాగేశ్వరరావు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : అగ్ని బాధిత కుటుంబాలకు ఇంటి నిర్మాణ సామాగ్రి వితరణ)