క్రికెట్ త్రిషకు రూ. 1కోటి
– నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
– ముఖ్యమంత్రితో సహా మంత్రి పొంగులేటి, పలువురి అభినందనలు
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి : విశ్వవేదికపై చిచ్చరపిడుగులా చెలరేగి ప్రపంచకప్ ను కైవసం చేసుకునేందుకు పాటుపడిన మహిళా అండర్ 19 ప్రపంచ కప్ అత్యుత్తమ క్రికెటర్ గొంగటి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం పట్టణానికి చెందిన త్రిష అంతర్జాతీయ స్థాయిలో చరిత్రను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకోవాలని ఆకాంక్షించారు. మహిళా వరల్డ్ కప్ చరిత్రలోనే సెంచరీ చేసి తన సత్తాను చాటిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున శాలువా కప్పి జ్ఞాపకం అందజేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాచలం ఇల్లందు ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య త్రిషను ప్రత్యేకంగా అభినందిస్తూ క్రికెట్ ఆటపై స్ఫూర్తి నింపిన తల్లిదండ్రులను కొని ఆడారు. (Story : క్రికెట్ త్రిషకు రూ. 1కోటి)