ఏ జి పి. ముప్పాళ్లకు..
మున్సిపల్ కమిషనర్ కు సన్మానం
న్యూస్ తెలుగు/ వినుకొండ : శ్రీ వాసవి కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నూతనంగా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ( ఏజీపి ) గా నియమితులైన ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు ని మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ మున్సిపల్ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి కూడా కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కోట బాలకృష్ణ రావు మాట్లాడుతూ. వినుకొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం చాలా అనందంగా గా ఉందని తెలిపారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలోని అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయ సేవలు అందిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నత పదవులను చేపట్టి నేడు ఏజీపీగా నియమితులైన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట బాలకృష్ణ రావు, ట్రెజరర్ కోట వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మండవ వెంకట కిరణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు అన్నా సుబ్బారావు, పచ్చిపులుసు రామాంజనేయులు, గజవల్లి శివయ్య, గుడిపాటి నాగ శ్రీనివాసరావు,కాకుమాను అనిల్, గాజుల మస్తాన్ మరియు సభ్యులు పాల్గొన్నారు.(Story : ఏ జి పి. ముప్పాళ్లకు.. మున్సిపల్ కమిషనర్ కు సన్మానం)