Home వార్తలు తెలంగాణ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

0

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : యువత భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోని విజయం సాధించాలని, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించానుకుంటే నిబద్ధత కఠోర సాధన చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా మీ కలలను సాధించుకోవచ్చని, యువత తమ సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్న ఉద్యోగాలను సాధింగలరని జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో- ఎడ్యుకేషన్) వనపర్తి యందు సైబర్ సెక్యూరిటీ మరియు షీ- టీం అవేర్నెస్ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ రావు ఐపీఎస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్షంగా విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారి యొక్క లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సిఐ, క్రిష్ణ , షీటీం ఎస్సై, అంజద్. కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్, లెక్చరర్స్ దాంసింగ్, వెంకట స్వామి, యాదగిరి గౌడ్, రామకృష్ణ మూర్తి, సునీత భాయ్, మల్లికార్జున్, రాఘవేంద్ర, రంజిత్, స్వప్న,నాగలక్మి, వెంకట స్వామి మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక మొత్తంలో హాజరయ్యారు. (Story : తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version