పౌరాణిక,పద్య నాటక ప్రదర్శన కు విశేష స్పందన..
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవనజ్యోతి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆర్టీసీ డిపో సెంటర్ నందు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పౌరాణిక పద్య నాటకములు ప్రదర్శించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు మంద వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, మక్కెన మల్లికార్జున రావు హాజరై కళాకారులను అభినందిస్తూ, కళాకారుల ప్రదర్శన తిలకించి జ్ఞాపికలు అందజేశారు. దుర్యోధనుడు పాత్రలో ముత్తినేని గిరిబాబు చూపిన నటన చూపర్లను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్య ప్రదర్శన మరియు రమణశ్రీ నెల్లూరు వారి నటన మెచ్చుకున్న ముఖ్యఅతిథి మక్కెన కళాకారులను ఆదరించడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని కళాకారులు కావలసినవి ఈ ప్రభుత్వం నెరవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు మిరియాల వెంకట రమణయ్య అలాగే జనసేన పార్టీ జిల్లా ఇంచార్జ్ నిశంకర శ్రీనివాస్ రావు, జాషువా సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు సిహెచ్ జాన్ సుందర్ రావు, బీసీ నాయకులు కాలింగరాజు, విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి రచయిత కనుమూరి రాజ్యలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య, పాల్గొనగా సభా కార్యక్రమానికి సభ అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు పల్ల మీసాల దాసయ్య, హాజరై మాట్లాడుతూ. కళాకారులను ఆదుకునేది కూటమి ప్రభుత్వమేనని ఎందుకంటే జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత ఎన్టీఆర్ స్వతహాగా కళాకారులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మందా వెంకట్రావు మాట్లాడుతూ. హాజరైన కళాకారులకు ముఖ్య అతిథులకు ఈ కార్యక్రమాని సహకారాలు అందించిన నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ని, అదేవిధంగా అధికారులను కొనియాడుతూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.(Story : పౌరాణిక,పద్య నాటక ప్రదర్శన కు విశేష స్పందన..)