ఏ. జి. పి ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు కు ఏఐసీసీ నాయకుల సన్మానం
న్యూస్ తెలుగు /వినుకొండ : సహోదర ప్రేమ కలిగిన వ్యక్తి ముప్పాళ్ళ జ్ఞానేశ్వర రావు అని ఏఐసీసీ అధ్యక్షులు డేవిడ్ పాస్టర్ అన్నారు. వినుకొండ, పాస్టర్స్ కాలనీ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసీసీ నాయకులు ఏ జి పి ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావును సన్మానించడం జరిగిందని నియోజకవర్గ ఏఐసీసీ అధ్యక్షులు రెవ కొత్త డేవిడ్ పాస్టర్ అన్నారు. మంచి మనసుతో నలుగురికి మంచి చేసే వారికి ఎల్లప్పుడు దేవుడి దీవెనలు ఉంటాయని, ఏఐసీసీ నాయకులు అన్నారు. చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆర్థిక సహాయం, ముప్పాళ్ళ జ్ఞానేశ్వర రావు సహకారంతో వినుకొండ లో పాస్టర్స్ కాలనీ ఏర్పాటు జరిగిందని ఏఐసీసీ నాయకులు అన్నారు. ఈ సందర్బంగా ఏజిపి కి శాలువ, పూల బొకేతో సత్కరించి అనంతరం ప్రార్థించి ఆశీర్వదించారు. ఏజిపి ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు దేవుని సేవకులు తన మీద ఉంచిన ప్రేమ అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు జె.బుజ్జిబాబు, టి.ప్రభుదాస్, కే.సుదర్శనం, సువర్ణ రాజు, వై యేసు పాదం, ఆశీర్వాదం, మోషే , ఇస్సాకు లాజరు మరియదాసు తదితరులు పాల్గొన్నారు. (Story : ఏ. జి. పి ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు కు ఏఐసీసీ నాయకుల సన్మానం)