తహసిల్దార్ ను అభినందించిన చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వ ఉద్యోగులు సమాజ హితం కోరి పనిచేసినప్పుడు ప్రజా హృదయాలలో నిలిచిపోతారని ఆ కోవకు చెందిన వారే వినుకొండ తహసిల్దార్ సురేష్ నాయక్ అని చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ నుండి ఉత్తమ తహసిల్దార్ అవార్డును అందుకున్న సురేష్ నాయక్ ను పూలమాలతో చైతన్య స్రవంతి సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సురేష్ నాయక్ మాట్లాడుతూ. వృద్ధాశ్రమంలో వృద్ధులకు మీరు చేస్తున్న సేవల గురించి వింటున్నానని, త్వరలో మీ వృద్ధాశ్రమాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ముఖ్యాని రామయ్య, అందరివాడు సద్దాం, గుమ్మడి పాల్గొన్నారు.(Story : తహసిల్దార్ ను అభినందించిన చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ )