Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు సహకారంతో ఆదర్శంగా గ్రేటర్ వినుకొండ అభివృద్ధి

చంద్రబాబు సహకారంతో ఆదర్శంగా గ్రేటర్ వినుకొండ అభివృద్ధి

0

చంద్రబాబు సహకారంతో ఆదర్శంగా గ్రేటర్ వినుకొండ అభివృద్ధి

ప్రజా సమస్యలపై వినుకొండ మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి వార్డు పర్యటనలు

న్యూస్ తెలుగు /వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖమంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా, రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాతామని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. భవిష్యత్ అవసరాల మేరకు పట్టణాన్ని నలువైపులా విస్తరిస్తామని, ఆగిపోయిన అమృత్ మంచినీటి పథకం, అర్బన్‌ హౌసింగ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ అర్బన్ హౌసింగ్‌ లబ్దిదారులకు 6నెలల్లో పూర్తిచేసిన ఇళ్లు అంది స్తామన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం వినుకొండలో పలు వార్డుల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. స్థానిక 23, 31, 32 వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లపై వచ్చిన అర్జీలు పరిష్కరించాలని అధికారు లు, మున్సిపల్ ఛైర్మన్‌కు సూచించారు. అనతంరం ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణం చుట్టుపక్కల పంచాయతీల పరిధిలో ఉండి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలన్నింటి నీ గ్రేటర్ పరిధిలోకి తీసుకుని వస్తామన్నారు. మంచినీరు, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం స్థానిక ప్రజల నుంచి ఉన్న వినతుల మేరకే ఆ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పట్టణాని కి అవుటర్ రింగ్ రోడ్డు కూడా రానుందన్నారు. 5 లక్షల జనాభా వినుకొండలో ఉన్నా ఇబ్బంది లేకుండా ఎన్నెస్పీ కాలనీలో స్టేడియం, పార్కు, స్విమ్మింగ్‌పూల్, షాదీఖానా అన్ని నిర్మాణాలు చేపడతామన్నారు. జగన్ నిర్వాకం కారణంగా నాడు ఏషియన్ బ్యాంకు నుంచి వచ్చిన 3వేల కోట్లు నిధులు మురిగిపోయాయన్నారు. నాడు అర్బన్ హౌసింగ్‌ వెంకయ్యనాయుడు రాష్ట్రానికి లక్షల ఇళ్లు ఇచ్చారని, వాటిల్లో వినుకొండకు 4వేలకు పైగా తీసుకువచ్చామని తెలిపారు. కానీ వైకాపా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నిర్వాకం కారణంగా అన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత మంచినీటి పథకం కోసం రూ.159 కోట్లు తెస్తే దానిని అటకెక్కిం చారని వాపోయారు. ఇప్పుడు అవన్నీ పూర్తిచేస్తామని కొత్తగా ఇళ్లు కూడా అందిస్తామన్నారు. పట్టణాల్లో 2సెంట్లు, పల్లెల్లో 3సెంట్ల స్థలాలకు త్వరలోనే పట్టాలు ఇస్తామన్నారు. వినుకొండ పట్టణ పరిధిలోఇళ్లు కావాలి అనుకునే వారు మున్సిపల్ కమిషనర్‌ను కలసి 2 రోజుల్లో దరఖా స్తులు ఇవ్వాలన్నారు. గ్రామాల్లో హౌసింగ్ అధికారుల్ని కలసి వినతులు ఇవ్వాలన్నారు. వినుకొండకు ఎన్నినిధులు కావాలన్నా ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని, పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో ప్రతిపేదవాడికి ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంగా తెలిపారు. వైకాపా ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన అమరావతిని చంద్రబాబు తిరిగి ముందుకు తీసుకుని వెళ్తున్నారని.. కేంద్రం నుంచి రూ.15వేల కోట్లు నిధులు సాధించారన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రపంచంలోనే గుర్తింపు ఉండేలా తీర్చిదిద్దుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. (Story : చంద్రబాబు సహకారంతో ఆదర్శంగా గ్రేటర్ వినుకొండ అభివృద్ధి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version