మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యలపై చర్చ
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మున్సిపాలిటీ లో ఇంజనీరింగ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా మంగళవారం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ని కలిసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎదురుకొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ బెస్ట్ అవార్డ్ అందుకున్న వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ లు ఆదినారాయణ, దేవిక మేడం ,ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు రేవిళ్ళ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.కె నాగూర్, కమిటీ మరియు కార్యవర్గ సభ్యులు స్వామి,నాసరయ్య, నాగరాజు, ఖాజా, ప్రసాద్, సుబ్రమణ్యం, చిన్న గాలెయ్య, రాముడు, ఖాసిం, రవి, లక్ష్మణ్, సుబ్బారావు, ఖాసిం, శ్రీనివాసరావు, మస్తాన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.(Story : మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యలపై చర్చ)