ఆన్లైన్ ఆటో డ్రైవర్ల అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించండి
కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీలను నెరవేర్చండి
ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్
ఆటోలకు అంటించే యూనియన్ స్టిక్కర్లు విడుదల
న్యూస్‌తెలుగు/చింతూరు : సిపిఐ పోరాటాల ఫలితంగా నేటి నుండి కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయింపులకు మార్గదర్శకాలు విడుదల చేసిందని ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఆన్లైన్ ఆటోడ్రైవులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు
మంగళవారం ఉదయం స్థానిక అంబల్ల సూర్యరావు భవన్ లో ఆన్లైన్ రాపిడ్, ఓలా, ఒబర్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ సమావేశం అధ్యక్షులు
కే రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది
ముందుగా ఆటోలు కు అంటించే యూనియన్ స్టిక్కర్లను విడుదల చేసి అనంతరం అంటించారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ఆటో కార్మికులు బతుకు దెరువు కోసము పట్టణాలకు వచ్చారని విరందరకి ఒకచోటే రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మధు డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ , పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికీ ఆ హామీలు అమలు చేయడం లేదన్నారు ఆటో డ్రైవర్ల పిల్లలకు విద్య దీవెన మంజూరు చేస్తామని జీవో నెంబర్ 21 మరియు 31 రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి 7 నెలలు గడిచిన ఒక్క హామీలు కూడా అమలు చేయలేదన్నారు ఆటో డ్రైవర్ల అందరూ ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని మధు కోరారు
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కే శ్రీనివాస్ ఏఐవైఎఫ్ సిటీ కార్యదర్శి పి త్రిమూర్తులు యూనియన్ నాయకులు ఆర్ రవి, న్ శివ , ఆర్ సురేష్ సైమాన్, పీటర్,కె విజయ, టి సంతోష్ కుమార్, గణేష్ , సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story : ఆన్లైన్ ఆటో డ్రైవర్ల అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించండి)