నూతన పరిశ్రమల ద్వారానే యువతకు ఉపాధి
ఉద్యోగాల భర్తీ కోసం పోరాటలు ఉధృతం
దేశ అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం కల్పించాలి
జి ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి
న్యూస్‌తెలుగు/ఒంగోలు : దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే దేశంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి అన్నారు.
ఆదివారం నాడు స్థానిక మల్లయ్య లింగం భవన్ అఖిల భారత యువజన సమాఖ్య 16వ జిల్లా మహాసభలు సందర్భంగా ఏఐవైఎఫ్ అరుణ పతాకాన్ని మాజీ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు ఆవిష్కరించారు .
అనంతరం జిల్లా అధ్యక్షులు కరుణానిధి అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల మహాసభలో జి ఈశ్వరయ్య ప్రసంగిస్తూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని అమలు చేయకుండా ,విదేశాల దాగి ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పిన హామీలు గాలికి వదిలేసారని, కార్పొరేట్లకు దాసోహంగా మోడీ ప్రభుత్వం గులాంగిరి చేస్తుందని ఆరోపించారు. యువత ఉపాధి చూపించకుండా దేశంలో మత రాజకీయాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు కరణ, సామాజిక అంతరాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో బిజెపి ప్రభుత్వం సఫలం అవుతుంది అని దీన్ని గమనించాలని కోరారు.
నాడు దేశద్రోహులు నేడు దేశభక్తులు
దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని నాటి దేశ ద్రోహులు నేడు దేశభక్తులుగా పరిపాలన చేస్తున్నారని, అశేష త్యాగాలు ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సాధించుకుంటే అసలైన స్వాతంత్రం రామ మందిరం నిర్మించిన తర్వాత వచ్చిందని చెప్పడం సిగ్గుచేటని, మాజీ ప్రధానమంత్రి వాజ్ పాయ్ కూడా ఆర్ఎస్ఎస్ అవమానించినట్లేని , దేశ స్వతంత్ర పోరాటంలో ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా జైలుకెళ్లలేదని, ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని అండమాన్ జైల్లో ఎక్కువమంది కమ్యూనిస్టులే శిక్షలు అనుభవించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ అధినేత భగవత్ తన వ్యాఖ్యలు విరమించుకొని సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించండి
మోడీ విధానాల వల్ల రోజురోజుకి ప్రైవేట్ రంగం పెరుగుతుందని ప్రభుత్వ రంగం తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించి పేద బలహీన వర్గాలకు ఉపాధి ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అత్యంత దారుణమని, ప్రభుత్వ రంగ సంస్థల దారిన యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 10 లక్షలు ఉద్యోగాల భక్తి కోసం ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయడంతో పాటు రైల్వేలో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు చూడాలని కోరారు.
రాజధాని అమరావతి ఫ్రీ జోన్ చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అందరికి సంబంధించిన రాజధాని అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో ఫ్రీ జోన్ చేయడం ద్వారానే 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఒకే చోట కేంద్రీకరణ అయితే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగం ఉపాధి కల్పన ప్రథమ బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు పరిచి వేసి యువతకు ఉపాధి కల్పించలేని పక్షంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలు హాజరయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ వసతి మెటీరియల్ అన్ని కూడా ఇవ్వాలని కోరారు.
*శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22 రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా అభివృద్ధి కోసం యువత ఉద్యమించాలి
అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పిలుపునిచ్చారు. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 80% ఉద్యోగాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న సాగు తాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు..
ఈ మహాసభలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆరు రామకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామంజి, పవన్ కళ్యాణ్ స్వర్ణ వెంకట రమణ, తదితరులు పాల్గొన్నార (Story : నూతన పరిశ్రమల ద్వారానే యువతకు ఉపాధి)