మున్సిపల్ కార్యాలయంలో 76వ గణతంత్ర వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం.సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించగా. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, సానిటరీ అధికారి ఎస్కే ఇస్మాయిల్, మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకట రామమ్మ, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో అవార్డు అందుకున్న తాసిల్దార్ సురేష్ నాయక్ జెండాను ఆవిష్కరించారు. ఆర్ఐ శ్రీహరి, రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో డిపో మేనేజర్ నాగేశ్వరరావు జెండాను ఆవిష్కరించాటు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే పలు ప్రవేట్ ప్రభుత్వ పాఠశాలలో జెండాను ఎగరవేసి గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.(Story : మున్సిపల్ కార్యాలయంలో 76వ గణతంత్ర వేడుకలు)