బాలికలను సంరక్షించడం సామాజిక బాధ్యత
ఎన్ఎఫ్ఐ డబ్ల్యు నేతలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : బాలికలను సంరక్షించటం విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తు అందించటం సామాజిక బాధ్యతగా భావించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, గీత అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం నేపథ్యంలో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఆధ్వర్యంలో శనివారం వనపర్తి జిల్లా ఆఫీసులో కృష్ణవేణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మన వ్యవస్థలో మగ పిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ అనే అభిప్రాయం ఉందని తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.మగ పిల్లలతో సమానంగా అన్ని వృత్తుల్లో ఉద్యోగాల్లో ఆడపిల్లలు సత్తా చాటుతున్నారు. వంట ఇంటి నుంచి అంతరిక్షం వెళ్లే దాకా మహిళలు ఎదిగారన్నారు. సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు రాణించి పాలనలో తమ ముద్ర వేస్తున్నారన్నారు. విద్యలో ఉద్యోగంలో పురుషులకు మహిళలు తీసిపోవటం లేదన్నారు. తమ కుటుంబాల్లో ఆడపిల్లలు పుట్టకూడదని నూటికి 90 శాతం కోరుకుంటున్నారన్నారు. ఆడపిల్లకుచదువు, పెళ్లి భారంగా పలువురు భావిస్తున్నారన్నారు. మగ పిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తగ్గి మగ పిల్లలకు ఈడు దాటిన పెళ్లిళ్లు కాని పరిస్థితి సమాజంలో ఉందన్నారు. ఈ పరిస్థితిపై తల్లిదండ్రులు కళ్ళు తెరవాలి అన్నారు. దురదృష్టవశాత్తు బాలికల హత్యలు, అత్యాచారాలు,వేధింపులు, అణచివేత కొనసాగుతున్నయని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సరిపోవటం లేదన్నారు. సమాజం బాధ్యత తీసుకోవాలని కోరారు. మహిళా సంఘం పక్షాన తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని కోరారు. నాయకులు కళావతమ్మ, జయమ్మ, భూమిక, శిరీష, జయశ్రీ, పద్మ, జ్యోతి, దేవమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story : బాలికలను సంరక్షించడం సామాజిక బాధ్యత )