గ్రామసభల్లో చదివే పేర్లు దరఖాస్తుదారులవే అర్హులవి కావు!
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజలందరూ అర్హులవే అనుకోని గందరగోళానికి గురవుతున్నారు ప్రజలకు క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులపై ఉండాలి అని వనపర్తి బిజెపి ధార్మిక సెల్(ఎండోమెంట్) కో కన్వీనర్ భగవంతు యాదవ్ కోరారు. దరఖాస్తు దారుల పేర్లు చదువుతూ వారందరూ అర్హులైనట్టు ప్రజలకు ఆశాల్లోకి నెట్టేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్దిపొందేందుకు జిమ్మిక్కు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు ఇంటింటికి వచ్చి కుటుంబ కుల గణన చేసిన డేటా అన్ని కూడా కంప్యూటర్ చేశారు. అందులో సమగ్రమైన వివరాలు ప్రభుత్వం వద్ద అధికారుల వద్ద ఉండగా దరఖాస్తు దారుల లిస్టులు చదువుతూ అందులో పేరు రానివారికి మళ్ళీ దరఖాస్తులు చేసుకొమ్మని ఎందుకు ప్రజలను పరేషాన్ చేస్తున్నారో సృష్టంగా ప్రజలకు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికి పథకాలు అందిస్తేనే కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు లేదంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తెలంగాణలో విశ్వసించరు. (Story : గ్రామసభల్లో చదివే పేర్లు దరఖాస్తుదారులవే అర్హులవి కావు!)