బాప్టిస్ట్ ఆస్తులను పరిరక్షిస్తాం..
బాప్టిస్ట్ స్థలంలో సిలువను తొలగించిన దుండగులను శిక్షించాలి..
మాజీ ఎమ్మెల్యే మక్కెన సహకారం తో చీఫ్ విప్ జీవీ ని కలసిన క్రైస్తవనాయకులు..
పార్టీలకు అతీతంగా ఏకమైన బాప్టిస్ట్ సంఘ స్తులు..
బాప్టిస్ట్ ఆస్తులజోలికి వస్తే చర్యలు తప్పవు.బాప్టిస్ట్ సంఘ సభ్యులు..
సిలువను తొలగించి క్రైస్తవుల మనో భావాలను కించపరిచిన
దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి..
క్రైస్తవ సంఘాల డిమాండ్..
దళారులకు సహకరిస్తున్న క్రైస్తవ దొంగలను కఠినంగా శిక్షించాలి..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్ లోని మిస్సమ్మ బంగ్లాలో ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ సభ్యులు ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేసుకున్న సిలువను బుధవారం అర్ధరాత్రి క్రైస్తవ దొంగల సహకారంతో దళారులు తొలగింటం జరిగింది. గురువారం ఉదయాన్నే సిలువ తొలగించిన విషయాన్ని తెలుసుకున్న బాప్టిస్ట్ సంఘ కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు మిస్సమ్మ బంగ్లా లోనిసంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు లను టిడిపి కార్యాలయంలో కలిసి సమస్యను వివరించగా, క్రైస్తవుల పక్షముగా కూటమి ప్రభుత్వం అధికారులు పనిచేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. దళారులు సిలువను తొలగించిన తీరు, క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన దళారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులు, కమిటీ, సంఘ పెద్దలుకోరడం జరిగింది. తక్షణమే స్పందించిన చీఫ్ విప్ జీవి వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ రికార్డులు పరిశీలించలని, పట్టణ సిఐ శోభన్ బాబుకు సిలువను తొలగించి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు, పట్టణ సిఐశోభన్ బాబులను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని బాప్టిస్ట్ సంఘ పెద్దలు కోరడం జరిగింది. వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ ని కలిసి వందల సంవత్సరాల క్రితం క్రైస్తవ మిషనరీలు ఎంతో శ్రమపడి సంపాదించిన క్రైస్తవస్తులను సంరక్షించు కోవలసిన క్రైస్తవు లలో కొందరు క్రైస్తవ దొంగలు దళారుల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా క్రైస్తవ ఆస్తులను దారా చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు చేయడానికి ఊడిగం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకొని క్రైస్తవాస్తులను పరిరక్షించి క్రైస్తవ సమాజానికి మేలు చేయాలని తాసిల్దార్ సురేష్ నాయక్ కు క్రైస్తవ నాయకులు, బాప్టిస్ట్ సంఘ సభ్యులు సంఘస్తులు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ సంఘ కార్యదర్శి జి. ఆశీ వరప్రసాద్, ఉప కార్యదర్శి కె. వినోద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బి. గబ్రియేల్, బాప్టిస్ట్ సంఘపెద్దలు, సీనియర్ సంఘ కాపరి బి. జాషువా పి. ఫిలిప్, పి నరసింహ రావు, కె. శివ కుమార్, టి. జోసప్, పి. ప్రసాద్, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : బాప్టిస్ట్ ఆస్తులను పరిరక్షిస్తాం..)