Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజాసేవకు కొత్తభాష్యం చెబుతున్న ఆదర్శనాయకుడు లోకేష్

ప్రజాసేవకు కొత్తభాష్యం చెబుతున్న ఆదర్శనాయకుడు లోకేష్

0

ప్రజాసేవకు కొత్తభాష్యం చెబుతున్న ఆదర్శనాయకుడు లోకేష్

మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేసిన జీవీ, మక్కెన

న్యూస్ తెలుగు / వినుకొండ : అన్నా అంటూ ఒక్క ఎస్సెమ్మెస్, ఒక్క వాట్సాప్ సందేశం వస్తే చాలు సప్తసముద్రాల ఆవల ఉన్నా సాయం అందిస్తూ ప్రజాసేవకు కొత్తభాష్యం చెబుతున్న ఆదర్శ నాయకుడు మంత్రి లోకేష్ అంటూ ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు . తాతకు తగ్గ మననవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ధి, తెలుగువారి ఔన్నత్యం కోసం ప్రతిక్షణం కష్టపడుతున్న ఆయన నిండునూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 93శాతమంది ఎమ్మెల్యేలు గెలుపొందడంలో అహర్నిశలు కృషి చేశారని, 3123 కి.మీ. మేర పాదయాత్ర చేసి యువతలో స్ఫూర్తి, అన్నివర్గాల్లో ఉత్తేజం, ధైర్యాన్ని నింపిన ఆయ న కృషి అనితర సాధ్యమన్నారు. వినుకొండలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా నిత్యం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలిచి సహకరించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ ఐటీ శాఖమంత్రిగా గూగుల్ క్లౌడ్‌, టీసీఎస్‌ లాంటి దిగ్గజ కంపెనీలకు రాష్ట్రానికి తీసుకుని వచ్చి రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 117 జీవోను రద్దు చేసి విద్యా ర్థులకు ఎంతో మేలు చేశారని. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారన్నారు. ప్రతిపాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారని, పిల్లకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. లోకేష్ గతంలో పంచా యతీ రాజ్ శాఖమంత్రిగా కూడా ఎంతో మంచి చేశారని గ్రామాల్లో 25వేల కి.మీ. సిమెంట్ రోడ్లు వేశారు. 24వేల మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛంధ్రను విజయవంతం చేశారన్నారు. ప్రతిగ్రామంలో ఎల్‌ఈడీ బల్బులతో వెలు గులు నింపారన్నారు. ఇదే సమయంలో పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ ప్రమాదాల్లో చనిపోయిన పార్టీ సభ్యుల కుటుంబాల పిల్లల్ని చదివిస్తూ, రాజకీయ హత్యలకు గురైన కుటుంబాల్ని ఆదుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైన సేవలు అందించారన్నారు. పేదరికం లేని సమాజం, రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు సంక్షేమం అందించడం, సేవ చేయడంలో లోకేష్‌ను ఆదర్శంగా తీసుకు ని ముందుకు వెళ్తామన్నారు. నేటి యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు రాష్ట్రానికి దిక్సూచీలాంటి లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అతి చిన్నవయస్సులోనే ఎంతో అనుభవం గడించి, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్ట పడుతున్న నాయకుడు లోకేష్ అన్నారు. తెలుగుయువత ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. పండ్లు పంపిణీ, అనాథాశ్రమాల్లో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. (Story : ప్రజాసేవకు కొత్తభాష్యం చెబుతున్న ఆదర్శనాయకుడు లోకేష్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version