జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ 2 మావోయిస్టులు మృతి
ఇద్దరూ పోలీస్ జవాన్ లకు గాయాలు
న్యూస్‌తెలుగు/చింతూరు : జార్ఖండ్ – చతిస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారు జామున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే బొకారో జిల్లా బొకరో జిల్లా నవడిహ్ బ్లాక్ లోని పెంక్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉపర్ ఘాట్, జార్వ అడవుల్లో బుధవారం గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు ఎదురుపడి పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో మృతి చెందారు. మృతుల్లో ఒకరు మహిళవున్నారు. ఆ మహిళ హార్డ్ కోర్ మావోయిస్టు రణ విజయ్ మహాతో భార్య అని ఉన్నతాదికారులు పేర్కొన్నారు. (Story : జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ 2 మావోయిస్టులు మృతి)