భారీ ఎన్ కౌంటర్
20 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో ఇద్దరు మహిళలు
రు.కోటి రివార్డ్ కల్గిన కేంద్ర కమిటీ సభ్యులు చలపతి మృతి
గుడ్డు, మనోజ్ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు హతం
జవాన్లకు అభినందనలు తెలిపిన చతిస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్
న్యూస్ తెలుగు /చింతూరు : ఒరిస్సా- చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దులోని నౌపాడ, గరియా బంద్ జిల్లా మొయిన్ పూర్ పోలీస్స్టేషన్ సరిహద్దుల్లోని కులరిఘాట్ అటవీ ప్రాంతంలో60 మావోయిస్టులు భారీ ఎత్తున సమావేశమయ్యారని నిఘా విభాగం అందించిన సమాచారం అందుకున్న చతిస్గడ్ – ఒరిస్సా కు
65, 211 సిఆర్పిఎఫ్ బేటాలియన్ ,207 కోబ్రా, డి ఆర్ జి జవాన్లు, యస్ ఓ జి, ఈ, 30 బలగాలు సుమారు వెయ్యి మంది పోలీస్ బలగాలు
ఆదివారం సాయంత్రం నుండి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గత 24 గంటలు గా అడవి ని జల్లెడ పట్టాయి.కుల రీఘాట్ రిజర్వుడ్ ఫారెస్ట్ లో మావోయిస్టు లు ఎదురుపడి జవాన్ లపై రాకెట్ లాంచర్ లాంటి ఆయుధాలు విసిరారు. చెక్కుచెదరని మనోధైర్యంతో జవాన్లు ముందుకు వెళ్లి 20 మంది మావోయిస్టులను మంగళవారం ఉదయం వరకు మట్టు పెట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. పదిమంది పురుషుల్లో కేంద్ర కమిటీసభ్యులు,జోనల్ కమిటి మనోజ్, గుడ్డు ,బాలన్న ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు జై రామ్@ చలపతి@ రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇతనిపై ఒరిసా ప్రభుత్వకలెక్టర్ వినీలకృష్ణ రు కోటి రివార్డ్ 2011లో ప్రకటించారు . ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా. తవళం పల్లి మండలంమత్యం గ్రామానికి చెందిన వాడు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పై అలిపిరి బాంబు సంఘటనలో కీలక సూత్రదారి ఇతనేనని గరియాబంద్ పోలీసులు ధ్రువీకరించారు. వరంగల్ జిల్లా దామోదర్ ఏలియాస్ చొక్కా రావు కోసం విస్తృత గాలింపు జరుగుతుంది. ఎన్కౌంటర్లో అధిక సంఖ్య లో మావోయిస్టులు గాయాలపాలైనట్లు తెలిసింది. సంఘటన స్థలం నుండి ఎస్ ఎల్ ఆర్, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఐడి బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్తృతంగా గాలింపులు కొనసాగుతున్నట్లు తెలిసింది. చత్తీస్గడ్ జవాన్లు, పోలీసులు చేసిన ఈ ఎన్కౌంటర్ ను అతి పెద్ద విజయంగా పేర్కొంటూ చతిస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ అభినందనలు తెలిపారు. కేంద్రహోమ్శాఖ మంత్రి అమిత్ షా సంకల్పాన్ని బలపరుస్తూ భద్రతా దళాలు నిరంతరం విజయం సాధిస్తున్నాయని, 2026 నాటికి చతిస్గడ్ రాష్ట్రం కచ్చితంగా నక్సలి జం నుండి విముక్తి పొందుతుందన్నారు.
మావోయిస్టులకు ఎదురు దెబ్బ. అమిద్ షామావోయిస్టు లకు కోలుకోలేని ఎదురు దెబ్బ అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మావోయిజం కొన ఊపిరితో ఉందని, 2026 కి మావోయిస్టు రహిత భారత దేశం గా కొనసాగడానికి ఈ సంఘటన మలుపు అని పేర్కొన్నారు. (Story : భారీ యన్ కౌంటర్)