లక్ష్మీపల్లి.శ్రీధర్ రెడ్డినీ హత్యచేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : గత ఏడు నెలల క్రితం లక్ష్మీపల్లికి చెందిన మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి హత్యగావింపబడి ఏడు నెలలు గడుస్తున్న నేటికి నిందితులను పట్టుకోకపోవడం విడ్డూరం అని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎస్.పికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల వల్ల కుటుంసభ్యులలో మరియు నాయకులలో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆంధ్రతా భావానికి గురవుతున్నారని అన్నారు. స్పందించిన ఎస్.పి రావుల.గిరిధర్ గారు నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చాలా సమయం ఓపికపటామని అతి త్వరలో ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేస్తామని నిందితులను పట్టుకునేవరకు పోరాడుతామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వెంట రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిలాష్ రావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, ,మాజీ ఎం.పి.పి సోమేశ్వరమ్మ,మాజీ Z.P.T.C వెంకట్రావమ్మ కుటుంబ సభ్యులు
ఉన్నారు. (Story : లక్ష్మీపల్లి.శ్రీధర్ రెడ్డినీ హత్యచేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలి)