Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘ‌నంగా ఎన్టీఆర్29 వర్ధంతి

ఘ‌నంగా ఎన్టీఆర్29 వర్ధంతి

ఘ‌నంగా ఎన్టీఆర్29 వర్ధంతి

న్యూస్ తెలుగు/ సాలూరు : సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డులో రెపరెపలాడించిన మహోన్నతమైన వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు అని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు శనివారం ఎన్టీఆర్29 వర్ధంతి సందర్భంగా సాలూరులో వున్న ఆమె కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలు, నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరంసాలూరులో డీలక్స్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు నేలపై ఆత్మగౌరవ నినాదం మారుమ్రోగించిన తెలుగు పౌరుషం స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అని ఆమె అన్నారు.
సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపకులు, కలియుగ పురుషులు అన్న నందమూరి తారకరామారావు అని అన్నారు.
చరిత్ర పుటలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న యుగపురుషులు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం అన్న నందమూరి తారకరామారావు అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు సేవా స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని తెలిపారు.ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇచ్చి ఆడపిల్లలకి గౌరవం, మర్యాద పెంచిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని అన్నారు.ఎన్టీఆర్ ఆశయాలను పునుకుపుచ్చుకొని ముందుకు వెళ్తున్న నారా చంద్రబాబునాయుడు కి మనమందరం తోడుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేశు టిడిపి నాయకులు వైకుంఠపు హర్షవర్ధన్. మిగడ శ్రీను, అశోక్, సారికి బాలాజీ, చొక్కాపు త్రినాధ ముఖి సూర్యనారాయణ ,అల్లు అప్పయమ్మ ,వైదేహి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.(Story : ఘ‌నంగా ఎన్టీఆర్29 వర్ధంతి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!