Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

 జనసేన నేత గురాన అయ్యలు

న్యూస్‌తెలుగు/ విజయనగరం : పేదల అభ్యున్నతికి కృషి చేసిన స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద వున్న ఎన్టీఆర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేసుకున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పధకం తీసుకువచ్చారని కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్‌దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల వేంకటేష్ నాయుడు,
ఎంటి రాజేష్ , రంగూరి భరత్ , ఎమ్ .పవన్ కుమార్ , గొల్లపల్లి మహేష్ , వజ్రపు నవీన్ కుమార్,పృథ్వీ భార్గవ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics