ఐ టి డి ఎ పి ఓ ఆధ్వర్యంలో
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పతి నెల 3 వ శనివారం ‘స్వచ్చ ఆంధ్ర స్వచ్చ ధివాస్’ పేరుతో ప్రతీ గ్రామంలో పరిశుభ్రతే లక్ష్యంగా అనేకరకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట ప్రజలకు పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో భాగంగా చింతూరు మండలం లో ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి అపూర్వ భారత్, ఆద్వర్యంలో చింతూరు ప్రధాన కూడలి లో మానవహారం చేసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు .అనంతరం ర్యాలీగా బయలుదేరి బస్ స్టాండ్ నందు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో అనేకరకాలైన పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టా రు . ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలను ప్రతీ పౌరులు గమనించి స్వచ్ఛ ఆంధ్రను నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ కోరారు . ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన యమ్.పి.డి.ఒ శ్రీ చైతన్య ను ప్రాజెక్టు అధికారి అభినందించి టీం కు భహుమతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థల తరపున శాపిడ్ సంస్థ ప్రతినిధులు అహ్మద్ అలీ బృంధం, యం.పి.పి శ్రీమతి అమల , డిప్యూటీ డి.యం.హెచ్.ఓ పుల్లయ్య, యఫ్.ఆర్.ఒ అబ్దుల్ కలం ఆజాద్, తహశీల్దార్ చిరంజీవి, ఈ.ఓ.పి.ఆర్.డి జి.మోహన్ రావు, అన్నీ శాఖల ఉద్యోగస్తులు, ఆటో యూనియన్ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. (Story : ఐ టి డి ఎ పి ఓ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్)