పథకాల్లో అమల్లో అధికారులు అలసత్వం
వహిస్తే కఠిన చర్యలు
మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో చీఫ్ విప్ జీవీ సమీక్ష
న్యూస్ తెలుగు/ వినుకొండ : అర్హులైన పేదలందరికీ పథకాలు సక్రమంగా అందాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు ఫలాలు ప్రజలకు చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాల్సిం దేనని స్పష్టం చేశారు. వినుకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అంగన్వావాడీ లకు అండగా ఉంటున్నామన్న ఆయన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టుల వెంటనే భర్తీ చేపట్టనున్నామని అన్నారు. త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయని చెప్పారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వినుకొండ నియోజకవర్గంలో 366 అంగన్వాడీలుంటే వాటిల్లో 84 స్వంత భవనాల్లో, 92 పాఠశాల లు, పంచాయతీ భవనాల్లో నడుస్తున్నాయని, 140 వరకు అద్దె భవనాల్లో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. 29 భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో గర్భవతులు 1949మంది, బాలింతలు 2006మంది, 6ఏళ్ల లోపు చిన్నారులు 17581 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సకాలంలో, సక్రమంగా చేర్చాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, గర్భిణీ మహిళలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలపై అధికారులతో సవివరంగా చర్చించారు. రాష్ట్రం మొత్తంలో 2014-19 తెదేపా హయాంలో 6,119 అంగన్వాడీల నిర్మాణం చేస్తే.. వైసీపీ ప్రభుత్వం 2048 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేసి కేవలం 18 పూర్తి చేసిందని అదే చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల కొరత లేకుండా చూడాలని, వినుకొండ నియోజ కవర్గంలోని అన్ని అంగన్వాడీల్లో విద్యుత్ సదుపాయం కూడా తప్పనిసరిగా కల్పించాలన్నారు. (Story : పథకాల్లో అమల్లో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు)