బీజాపూర్ అడవుల్లో జల్లెడ పడుతున్న పోలీసులు
మావోయిస్టుల ఎన్‌కౌంటర్, 4 గురు మావోయిస్టుల మృతి
న్యూస్‌తెలుగు/ చింతూరు : మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు దాగి ఉన్నారని సమాచారం అందడంతో భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను శోధించి నిర్మూలించేందుకు డిఆర్జి బీజాపూర్, సుకుమా, దంతివాడ, కోబ్రా 204,205,206,208,210 సిఆర్పిఎఫ్ 229 బెటాలియన్ల సంయుక్త బృందం గురువారం ఉదయం నుంచి అడవుల్లో నిరంతరం వెతుకుతోంది. సెర్చ్ ఆపరేషన్స్ సందర్భంగా మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. రెండు వైపుల నుండి అడపా దడపా కాల్పులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. రాత్రిపూట భద్రతా బలగాలు భారీ సంఖ్యలో హతమార్చే అవకాశం ఉంది. సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాతే ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. (Story : బీజాపూర్ అడవుల్లో జల్లెడ పడుతున్న పోలీసులు)