చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను కళాశాలలో నిర్వహించడం వలన విద్యార్థులలో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలగడం తోపాటు మన జీవితాల్లో పండగల ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కుల మత ప్రాంత బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఆనందోత్సాహలతో మూడురోజులు జరుపుకొనే పండగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగ అందరిజీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని అభిలాషించారు.ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు రంగవళ్ళులు,మేహింది, కేశాలంకరణ, సాంప్రదాయ వస్త్ర ధారణ, ఖో ఖో, కబడ్డీ, మ్యూజికల్ చైర్, వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసారు. అధ్యాపకులు విద్యార్థులు కలిసి కళాశాలలో బోగిమంటలు వేసారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్, జి వెంకటరావు, ఆర్ చి హెచ్ నాగేశ్వరరావు, జి హారతి, డాక్టర్ వై పద్మ, కె శకుంతల, యస్ అప్పనమ్మ, కె శైలజ, యన్ రమేష్, జి సాయికుమార్, బి శ్రీనివాసరావు, మూర్తి, సంగం నాయుడు, సినయ్య ఇతర అధ్యాపక, అధ్యాపకేతరసిబ్బంది,విధ్యార్థిని,విధ్యార్థులు పాల్గొన్నారు. (Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు)