వడ్డే ఓబన్న ఆదర్శప్రాయుడు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఆంగ్లేయులతో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన ధైర్య సహాసాలు అందరికీ ఆదర్శం అవ్వాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఓబన్న 209వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డెర జాతి బలోపేతానికి, సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కార చర్యలు చేపడతారని ఎమ్మెల్యే సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, సంగం నాయకులు వడ్డే కృష్ణయ్య, సంఘం సభ్యులు వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : వడ్డే ఓబన్న ఆదర్శప్రాయుడు)