ఉత్తరద్వార దర్శనం మోక్షదాయకం
విఠలేశ్వర పాండురంగస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఉత్తరద్వార పర్వదినం సందర్భంగా పట్టణ బ్రాహ్మణ వీధిలో ఉన్న విఠలేశ్వర పాండురంగస్వామిని వార్డు కౌన్సిలర్ బండారు.కృష్ణ ఆహ్వానం మేరకు గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరద్వారం దర్శనం మోక్షదాయకం అని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని పాండురంగ స్వామినీ వేడుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ,మురళీ శర్మ గార్లు సాదరంగా ఆహ్వానం పలికి ఘనంగా సన్మానించారు. నిరంజన్ రెడ్డి గారి వెంట వాకిటి.శ్రీధర్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం, ఉంగ్లమ్. తిరుమల్,నాగన్న యాదవ్,చిట్యాల. రాము,డాక్టర్. డ్యానియల్,పి.శ్రీనివాసులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఉత్తరద్వార దర్శనం మోక్షదాయకం )