మద్యం దుకాణాల్లో ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్మకాలు
న్యూస్ తెలుగు/చింతూరు: మద్యం వ్యాపారంలో కఠినమైన విధానాన్ని అవలంబించింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, వినియోగదారుల వద్ద నుండి అధిక చార్జీ వసూలు చేస్తే దుకాణాలు, బార్లపై కఠినమైన చర్యలను తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఎమ్మార్పీ ధరల కన్న అధికంగా వసూలు చేస్తే మొదటి నేరానికి ఐదు లక్షల రూపాయలు జరిమానా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే వారి లైసెన్సులు సైతం రద్దు చేయబడతాయని, ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికను సైతం లెక్కచేయకుండా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఎట్టపాక వైన్ షాపులో బాటిల్ పై ₹10 అధనంగా వసూలు చేస్తూ మద్యం వినియోగదారులపై అధిక భారం మోపుతున్నట్టు సమాచారం.(Story : మద్యం దుకాణాల్లో ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్మకాలు )