ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలి
మంత్రి కందుల దుర్గేష్
న్యూస్‌తెలుగు/చింతూరు : ఆరోగ్యకరమైన ఆహారం కొరకు ప్రకృతి వ్యవసాయం అవసరమని, రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని రాష్ట్రప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు.గురువారం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మధవరాయుడుపాలెం గ్రామంలో
సర్పంచ్ అన్నందేవుల వీరవెంకట సత్యనారాయణ (చంటి) ప్రకృతి వ్యవసాయ విధానాలలో పండిస్తున్న మినుము, పెసర పొలంను మంత్రి సందర్శించారు.మంత్రి దుర్గేష్ కు సర్పంచ్ చంటి వరి కంకు,నాగలి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయని అత్యంత కీలకమైన అంశముగా ప్రోత్సహిస్తుందన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార అందించాలని కోరారు. సర్పంచ్ చంటి మాట్లాడుతూ గత అయిదేళ్ళుగా ప్రకృతి వ్యవసాయ విధానాలలో వరి సాగుచేస్తున్నట్లు తెలిపారు.ఎపిసిఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.తాతారావు మాట్లాడుతూ జిల్లాలో 32,393 మంది రైతులు 37,641 ఎకరాలలో, కడియం మండలం లో 1252 మంది రైతులు 16083 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో గట్టి నర్సయ్య,పాఠంశెట్టి రవి,ముద్రగడ జమ్మి, అన్నందేవు రాజీవ్,కృష్ణ, ప్రకృతి వ్యవసాయ అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మహబూబ్ వలి, ఎన్ ఎఫ్ ఏ గౌతమ్, ఫార్మర్ సైంటిస్ట్ రాము, ఇతర ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, గ్రామంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలి)