ప్రజలు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు : జిల్లా ఎస్పీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : హత్యానేరం ఋజువై నందున నేరస్తునికి జీవిత కారగార జైలు శిక్షతో పాటు7,000/- రూ. జరిమానా విధించిన వనపర్తి జిల్లా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎం ఆర్, సునీత తేది:08-01-2025 నాడు తీర్పు ఇవ్వడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్టేషన్ పరిధిలోని బాలకిష్టపూర్ తాండ కు చెందిన మూడవత్ మణెమ్మ ను భర్త గోపాల్ నాయక్ పెట్రోల్ పోసి తగులబెట్టి చంపినందున కొడుకు కృష్ణ ఫిర్యాదు పై తేది:05-11-2020 అప్పటి ఆత్మకూరు ఎస్సై, ముత్తయ్య cr.no 106/2020 U/s 302, 498 (A) IPC నందు కేసు నమోదు చేయగా తేదీ 20.12
2020 రోజు మృతురాలు మరణించగా అప్పటి సీఐ సీతయ్య ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మృతురాలు ఇచ్చిన మరణ వాంగ్మూలంపై విచారణ జరిపి భార్యను వేధింపులకు గురిచేసి పెట్రోల్ పోసి చంపిన నిందితుడు మూడవత్ గోపాల్ పై అప్పటి సీఐ సీతయ్య ఛార్జ్ షీట్ ఫైల్ చేయనైనది
ప్రస్తుత సీఐ, శివకుమార్ , ఎస్సై, నరేందర్ ఆదేశాల మేరకు కోర్టు లైజనింగ్ అధికారి హెడ్ కానిస్టేబుల్, సత్యం, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు రాజేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. గోపాల్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించగా నేరస్తునిపై నేరం నిరూపణ అయినందున జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత , తీర్పు వెలువరించడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ తెలిపారు.
ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడడంలో బాగా పనిచేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను ఎస్పీ అభినందించి త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ కూడా శిక్ష నుండి తప్పించుకొలేరని, ప్రజలు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని ఎస్పీ తెలిపారు. పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ , న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు (Story : ప్రజలు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు : జిల్లా ఎస్పీ)