“విశాలాంధ్ర” కాలెండర్ ను ఆవిష్కరించిన
కడియం సిఐ.
న్యూస్‌తెలుగు/చింతూరు : ప్రతి నిత్యం ప్రజా సమస్యల పై పోరాటం చేస్తూ, అధికారులకు చేరవేస్తూ, సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజలు మన్ననలు పొందుతున్న పత్రిక “విశాలాంధ్ర” అని కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కడియం పోలీస్ స్టేషన్ ఆవరణలో, బుధవారం ఉదయం విశాలాంధ్ర కాలెండర్ ను సీఐ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవాలను వెలికితీసి “అక్షరాక్షరం అభ్యుదయం” నినాదంతో ప్రజల అభ్యుదయం కొరకు పాటుపడే పత్రిక విశాలాంధ్ర అని కొనియాడారు. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన విశాలాంధ్ర దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విలువలతో కూడిన జర్నలిజం ఈ పత్రిక సిద్ధాంతమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దుర్గాప్రసాద్, మహిళా ఎస్ఐ ధనలక్ష్మి ప్రసన్న, కడియం మండల విశాలాంధ్ర రిపోర్టర్ పళ్ళ వెంకటగిరి, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story : “విశాలాంధ్ర” కాలెండర్ ను ఆవిష్కరించిన కడియం సిఐ.)