బొల్లాపల్లి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్
న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సోమవారం బొల్లాపల్లి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, బొల్లాపల్లి మండల సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కి కండ్రిక, గుట్లపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తాగునీరు, సాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలను ఆనుకొని పెద్ద కాలువ నీళ్లు పారుతున్న ఈ గ్రామాల్లో తాగునీరు, సాగునీరుకి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎండాకాలం వస్తే మూగజీవాలు కూడా దాహార్తికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, వెంటనే ఈ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ చీప్ వీప్, వినుకొండ శాసనసభ్యులు జీవి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. (Story : బొల్లాపల్లి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్)