మావోయిస్టు మిలిషియా కమాండర్
న్యూస్ తెలుగు/చింతూరు : మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయిన మావోయిస్టు పార్టీ మిలిషియా కమాండర్ తెల్లం బుద్ర.శనివారం చింతూరు ఎ యస్ పి పంకజ్ కుమార్ మీనా ఎదుట
సిపిఐ మావోయిస్టు పార్టీ, సూర్పనగూడ మిలిషియా కమాండర్ అయిన తెల్లం బుద్ర( 43)లొంగి పోయాడు. ఇతని వివరాలు ఎ యస్ పి విలేఖరులకు వివరిస్తూ, చత్తీస్గఢ్ రాష్ట్రం, సుక్క జిల్లా, జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధి, చిమిలిపెంట గ్రామస్థుడని తెలిపారు.
ఇతనుసందేష్, ( ఏసియం ) వేగురుగొండ ( ఎల్ వో ఎస్) కమాండర్ ప్రేరేపించడం ద్వారా 2010 వ సంవత్సరంలో సూర్పనగూడ మిలీషియా సభ్యుడిగా నియమించబడ్డాడని తెలిపారు.2012 వ సంవత్సరంలో జేగురుగొండ ( ఎల్ వో ఎస్) కమాండర్ అయిన సోడె లక్క, తెల్లం బుద్రను సూర్పనగూడ మిలిషియా కమాండర్ గా నియమించాడు. ఇతనికి 2012వ సంవత్సరంలో 12 బోర్ ఆయుధమును కేటాయించారు. అప్పటినుండి ఇప్పటివరకు సూర్పనగుడ మిలిషియా కమాండర్ గా పనిచేశాడు. 2022 వ సంవత్సరం మే నెలలో, ఛత్తీస్ఘడ్ రాష్ట్రం లోని జేగురుగొండ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టు లకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను పాల్గొన్నాడని . ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని తెలిపారు .
మావోయిస్టులు మావోయిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు విసిగిపోయి.పార్టీలో పని చేసినప్పుడ మావోయిస్టు పార్టీకి చెందిన ఆదివాసియేతర నాయకుల నుండి వివక్షతగురై, మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం మరియు పార్టీ భావజలం మీద భ్రమలు తొలిగిపోవడం.
మావోయిస్టు పార్టీ కి పట్టున్న ప్రదేశాలలో పోలీసులు గస్తీ పెరగడం మరియు కొత్త పోలీస్ క్యాంప్ లు పెట్టడం వల్ల స్వేచ్ఛగా తిరగలేక ప్రాణ భయానికి గురికావడం. గిరిజన యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మావోయిస్టు పార్టీ నాయకులు వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని, అన్నింటిని మించి వీరు వారి యొక్క ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాల గురించి తెలుసుకొని మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం జరిగి,అల్లూరి సీతారామ రాజు జిల్లా పోలీసుల అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడం ద్వారా లొంగి పోయినట్లు తెలిపారు. లొంగిపోయిన బుద్రాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కావలసిన అన్ని పునరావాస చర్యలను అందిస్తామని ఎ ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టీ. దుర్గా ప్రసాద్ .చింతూరు యస్ ఐ.పి. రమేష్, , పి. దివాకర్, (అసిస్టెంట్ కమాండెంట్,ఈ కోయ్ 42 )ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. (Story : మావోయిస్టు మిలిషియా కమాండర్)