త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు /సాలూరు : కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం బెంగళూరులో పర్యటించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైందని తెలిపారు హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గతో కలిసి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగిందని ఆమె అన్నారు. ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. (Story: త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం )