Homeవార్తలుతెలంగాణఅమరుల ఆశయాలను సాధించాలి : సిపిఐ

అమరుల ఆశయాలను సాధించాలి : సిపిఐ

అమరుల ఆశయాలను సాధించాలి : సిపిఐ

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజల కోసం పోరాడిన అమరుల ఆశయాలను సాధించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బర్ధన్, వనపర్తి సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి డి చంద్రయ్య వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ కార్యదర్శి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, రమేష్, శ్రీరామ్, గోపాలకృష్ణ, శ్రీహరి, రవీందర్, పృథ్వినాదం మాట్లాడారు. దేశంలో బిజెపి మత రాజకీయాలు ముమ్మరమైన దశలో బర్ధన్ సిపిఐ పార్టీ పగ్గాలు చేపట్టి సమర్థ నాయకత్వం పార్టీని పటిష్టం చేసిందన్నారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నో కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. ఫలితంగా కార్మికులకు అనుకూలంగా పలు చట్టాలు వచ్చాయన్నారు. 1957లో మహారాష్ట్ర నాగపూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారన్నారు. పేద ప్రజల్లో ఆయనకున్న పట్టుకు ఆ గెలుపు నిదర్శనం అన్నారు. ప్రజా పోరాటాల్లో 20 సార్లు అరెస్ట్ అయ్యారని, 4 ఏళ్లు జైలు జీవితం గడిపారన్నారు. చనిపోయిన రోజు ఆయన ఐదు జతల దుస్తులు, బూట్లు, కొన్ని పుస్తకాలు మాత్రమే ఆస్తిగా లభించాయని, నిరాడంబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. జనవరి1, 2016 న ఆయన మరణించారన్నారు. జీవిత చరమాంకం వరకు ఎర్రజెండా పట్టి ప్రజల కోసం పనిచేశారని, ఆయన పోరాట స్ఫూర్తిని ప్రతి కార్యకర్త కొనసాగించాలన్నారు. డి చంద్రయ్య వనపర్తి డివిజన్ కార్యదర్శిగా, సిపిఐ వనపర్తి జిల్లా తొలి కార్యదర్శిగా పనిచేశారన్నారు. తాపీ మేస్త్రి గా జీవితాన్ని ప్రారంభించి జిల్లా కార్యదర్శిగా ఎదిగారన్నారు. వనపర్తి లో ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రయ్య నిలిచారన్నారు. పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు భూముల కోసం పోరాడారన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం నిర్మాణం ఆయన కృషివల్లే జరిగిందన్నారు. జిల్లా పార్టీ ఆయన పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన పని చేయటమే మనం అర్పించే నిజమైన నివాళి కాగలదన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, జె. చంద్రయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటియూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ఉపాధ్యక్షుడు శ్రీరామ్, ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, ఏఐవైఎఫ్ నేత లక్ష్మీనారాయణ,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష, సిపిఐ సీనియర్ నాయకులు చిన్న కురుమన్న, పృధ్వి నాదం తదితరులు పాల్గొన్నారు. (Story : అమరుల ఆశయాలను సాధించాలి : సిపిఐ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics