వనపర్తి ముఖచిత్రం క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ , ఎస్పీ ఆఫీసులో జిల్లా ఎస్పీ ,డి.ఎస్.పి వారి వారి చేతుల మీదుగా వనపర్తి ముఖచిత్రం క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి , S.P రావుల గిరిధర్ రావు క్యాలెండర్ ఆవిష్కరిస్తూ వనపర్తి చరిత్రను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన అఖిలపక్ష ఐక్యవేదికను అభినందిస్తూ నేటి యువతరానికి వనపర్తి చరిత్ర చెప్పడం చాలా అవసరం అని ఈ తరం మరిచిపోతున్న గతాలను మనమే గుర్తు చేయాల్సి వస్తుందని దాన్ని పరిపూర్ణంగా క్యాలండర్ ద్వారా ఆవిష్కరించిన సతీష్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు , అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, శివకుమార్, రవి, అక్కడే ఉన్న మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు. (Story : వనపర్తి ముఖచిత్రం క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్)